చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నారావారిపల్లి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, లబ్ధిదారులకు పలు సంక్షేమ కార్యక్రమాలకు చెందిన ఆస్తులను పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సీఎం వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు, చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సిఎం వెంట ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం ద్వారా నారావారి పల్లిలోని ఇద్దరు రైతులకు డ్రిప్ పరికరాలను బలరాం నాయుడు, జ్యోతిలకు అందచేశారు చంద్రబాబు నాయుడు. అధికారులకు సూచిస్తూ ఏపీఎంఐపి ప్రాజెక్టు కింద అర్హులైన అందరిని కవర్ చేయాలని సూచించారు.
ఇండోర్ సబ్ స్టేషన్ కు శిలాఫలకం
నారావారి పల్లె నందు సుమారు రూ. 4.27 కోట్లతో నిర్మించనున్న 33/కెవి సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ కు శిలాఫలకం ఆవిష్కరించి శంఖు స్థాపన చేసిన ముఖ్యమంత్రి. ఇక్కడ సిఎండి ఏపీఎస్పీడీసీఎల్ సంతోష్ రావు ఉన్నారు. ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్ ఏర్పాటుతో కవర్ చేయాలని తెలుపుతూ, అధికారులకు పలు సూచనలు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నారావారి పల్లి గ్రామ పరిధిలోని మూడు సచివాలయల పరిధిలో 26 అభివృద్ధి పనులు రూ. 3.21 కోట్ల పనులకు శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి.
నారావారి పల్లె గ్రామ అభివృద్ధిలో భాగంగా ఎ.రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్టేట్ ఆఫ్ ఆర్ట్ కింద ఆదర్శవంతమైన పాఠశాలగా శ్రీసిటీ సౌజన్యంతో రూ.1.10 కోట్లతో అభివృద్ధి చేయుటకు పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, ఐ ఎఫ్ పి ప్యానెల్స్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, ఎఐ రోబోటిక్ ల్యాబ్, క్రీడా సామాగ్రి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు శంఖుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.శ్రీసిటీ సౌజన్యంతోనారావారి పల్లె గ్రామ అభివృద్ధిలో భాగంగా ఎ.రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్టేట్ ఆఫ్ ఆర్ట్ కింద ఆదర్శవంతమైన పాఠశాలగా శ్రీసిటీ సౌజన్యంతో రూ.1.10 కోట్లతో అభివృద్ధి చేయుటకు పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, ఐ ఎఫ్ పి ప్యానెల్స్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, ఎఐ రోబోటిక్ ల్యాబ్, క్రీడా సామాగ్రి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు శంఖుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.
నారావారి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 8 అంగన్వాడి కేంద్రాలలోని అంగన్వాడీ కార్యకర్తలకు సామర్థ్య పెంపుదల కార్యక్రమాన్ని కేర్ అండ్ గ్రో సామాజిక చైతన్య ప్రతినిధుల ద్వారా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు కొరకు ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయుల మార్పిడి చేసుకున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మరియు కేర్ అండ్ గ్రో. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి ఒక ప్రాజెక్టుకు ఏంఓయును సంతకం చేశారనీ తెలుపుతూ సదరు కేర్ అండ్ గ్రో ద్వారా కుప్పం నందు 480 సెంటర్లలో అంగన్వాడీ కార్యకర్తలకు సామర్థ్య పెంపుదల కార్యక్రమాలు నిర్వహిస్తూ, పిల్లల మానసిక, శారీరక, విద్యా పరమైన అంశాలలో మెరుగ్గా ఫలితాలు వచ్చేలా చేపట్టిన చర్యలు, తల్లులతో సమావేశాలు నిర్వహించి వారికి అవగాహన కల్పించే ఈ కార్యక్రమం కుప్పంలో మంచి ఫలితాలు ఇస్తోందని, ఇక్కడ కూడా మంచి ఫలితాలు రావాలని అన్నారు.
గ్రామీణ మహిళలు ఇంటి వద్ద నుండే కిరాణా షాపులకు వస్తువులను సరఫరా చేసి తద్వారా వారి ఆర్థిక స్థితి గతులు మార్చుకునే విధంగా సౌలభ్యం కల్పించడానికి ఈజిమార్ట్ (Ezi mart), డిఆర్డిఎ – వెలుగు సంస్థ మధ్య ఒప్పంద సంతకం చేసి ఎంఓయులు మార్పిడి చేసుకోవడం జరిగింది.
నారా వారి పల్లి సమీపంలోని 5 గ్రామాల 200 మంది మామిడి రైతులతో ఎఫ్ పి ఓ ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారికి అందజేశారు. ప్రభుత్వ స్కీంల వినియోగంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెటింగ్ అనుసంధానంతో బిగ్ బాస్కెట్, రిలయన్స్, ప్రాసెసింగ్ యూనిట్లకు నేరుగా మార్కెటింగ్ చేసుకోవడం వలన మధ్యవర్తులు లేకుండా కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ప్రైమరీ ప్యాకింగ్ అండ్ గ్రేడింగ్ చేసుకుని నేరుగా వారు అమ్ముకునేందుకు ఈ ఎఫ్పీఓ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సిఎం తెలిపారు.
డ్వాక్రా సంఘాల మహిళలకు డి ఆర్ డి ఏ – వెలుగు మరియు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నారావారిపల్లి నుండి సి.రామాపురం గ్రామాలలోని మహిళలకు 15 e – ఆటోలు ఒక లక్ష యాభై వేలు సబ్సిడీతో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించారు. e- ఆటోల ద్వారా నెలకు 12,000 రూపాయల పెట్రోల్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ హితంగా ఉంటుందని అన్నారు.