Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: సచివాలయంలో అగ్నిప్రమాదం ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: సచివాలయంలో అగ్నిప్రమాదం ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు

ఏపీ సచివాలయంలో(AP Secretariat) శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu) పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, జీఏడీ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా సీఎంకు వివరించారు. పవర్ బ్యాక్‌అప్ కోసం బ్యాటరీలు భద్రపరిచే రూంలో మంటలు చెలరేగినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టంపై చంద్రబాబు ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

- Advertisement -

కాగా సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, నారాయణ పేషీలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News