Wednesday, December 4, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: సొంత ఇల్లు నిర్మించుకోనున్న సీఎం చంద్రబాబు.. ఎక్కడంటే..?

CM Chandrababu: సొంత ఇల్లు నిర్మించుకోనున్న సీఎం చంద్రబాబు.. ఎక్కడంటే..?

CM Chandrababu| గత ఐదేళ్లుగా ఆగిపోయిన ఏపీ రాజధాని అమరావతి(Amaravati) నిర్మాణం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు కూడా అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలోని ఉండవల్లిలో ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు కుటుంబం నివాసం ఉంటోంది. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆయన రెడీ అయ్యారు.

- Advertisement -

ఇందులో భాగంగా అమరావతి పరిధిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో E-6 రోడ్డుకు ఆనుకుని సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు కొనుగోలు చేశారు. ఇది రిటర్నబుల్ ప్లాట్ల కింద ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల నుంచి తీసుకున్నారు. రైతులకు ఇప్పటికే చెల్లింపులు కూడా చేశారు.

సీఎం చంద్రబాబు కొనుగోలు చేసిన ఈ స్థలం నాలుగు వైపులా రోడ్లు కలిగి ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్‌కు సమీపంలో ఉంటుంది. ఈ స్థలానికి చుట్టుపక్కల గెజిటెడ్ అధికారుల నివాసాలు, ఎన్జీవో కాంప్లెక్స్, జడ్జిల ఇళ్ల సముదాయం, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ వంటి కీలక భవనాలు ఉన్నాయి.

ఈ ఐదు ఎకరాల స్థలంలో ఒక భాగంలో తన సొంత నివాసం నిర్మించనున్నారు. మిగిలిన స్థలాన్ని గార్డెనింగ్, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి అవసరాల కోసం వినియోగించనున్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News