కొత్త సంవత్సరం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు చంద్రబాబుకు వేదాశీర్వం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
- Advertisement -
ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం సమకూర్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.