మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని నివాసం వద్ద ఉంచారు. ఈమేరకు పలువురు ప్రముఖులు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఢిల్లీ వెళ్లనున్నారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించనున్నారు. కాగా మన్మోహన్ మృతి పట్ల ఇప్పటికే ఎక్స్ ద్వారా చంద్రబాబు సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కాగా మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఇక ఇవాళ జరగాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగాల్సిన కేబినేట్ భేటీని వాయిదా వేశారు.