Friday, December 13, 2024
Homeఆంధ్రప్రదేశ్Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు..!

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు..!

Perni Nani| కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ(YCP) నేతల మీద వరుస కేసులు నమోదువుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు అరెస్ట్‌ అయి జైలు జీవితం గడుపుతుండగా.. మరికొందరు బెయిల్ మీద ఉన్నారు. తమ మీద ప్రభుత్వం పెద్దలు కక్షకట్టారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా ప్రజల సొమ్మును దోచుకోవడంతో పాటు దాడులు, కబ్జాలకు పాల్పడటంతోనే వారిపై కేసులు నమోదు చేస్తున్నామని కూటమి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై క్రిమనల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయింది.

- Advertisement -

మచిలీపట్నంలో నాని నిర్వహిస్తున్న గోదాములో రేషన్ బియ్యం గల్లంతు కావడంపై ఆయనపై కేసు నమోదైంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గోడౌన్‌లో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. అయితే తన గోడౌన్‌లో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని.. దాదాపు 3,200 బస్తాల తరుగు ఉన్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు పేర్ని నాని లేఖ రాశారు. తరుగు వచ్చిన బియ్యం బస్తాలకు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. దీంతో అధికారులు నవంబర్ 28, 29 తేదీల్లో తనిఖీలు నిర్వహించగా 3,700 బస్తాల బియ్యం తగ్గాయని గుర్తించారు.

దీనిపై సమగ్ర విచారణ చేయాలని పౌరసరఫరాల సంస్థ ఎండీ మన్‌జీర్ జిలానీ ఆదేశించారు. బియ్యం గల్లంతు విషయంలో నానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రూ.1.80 కోట్లు జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా గోడౌన్‌ను బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు వెల్లడించారు. కాగా మచిలీపట్నంలో నానికి చెందిన 40వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్‌ను గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకుని బియ్యం బస్తాలు నిల్వ ఉంచేవారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News