కావలి నియోజకవర్గంలో మీచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. కోతకు గురైన దగదర్తి-చెన్నూరు ప్రధాన రహదారిని పరిశీలించారు మంత్రి కాకాణి, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈసందర్భంగా వరద బాధితులను స్వయంగా మంత్రి కలిసి వారి సాదక బాధకాలను అడిగి తెలుసుకున్నారు.


