Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Cabinet: ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్.. చర్యలకు దిగిన ప్రభుత్వం

AP Cabinet: ఎస్పీలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్.. చర్యలకు దిగిన ప్రభుత్వం

AP Cabinet| ఇవాళ ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పోలీసు వ్యవస్థపై వాడివేడీ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కూటమి నేతలు, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు చేస్తున్న దుష్ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawankalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కొంతమంది ఇంట్లో ఆడవాళ్లను కూడా వదిలిపెట్టకుండా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని సీఎం చంద్రబాబు(CM Chandrababu) దృష్టకి తీసుకెళ్లారు. ఇలాంటి వారిపై ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు.

- Advertisement -

ఇంకా కొద్దిమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి పోలీసులు ఇప్పటికీ కీలక పోస్టుల్లో ఉన్నారని గుర్తుచేశారు. అంతేకాకుండా ఏదైనా సమస్యపై కొంతమంది ఎస్పీలకు ఫోన్ చేస్తే రియాక్ట్ కూడా కావడం లేదని ఆగ్రహించారు. కిందిస్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంట్లోని ఆడవాళ్లపైనా పోస్టులు పెడితే చూస్తూ ఎలా ఊరుకుంటామని.. అందుకే తాను రియాక్ట్ అయ్యానని సీఎంకు వివరించారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ.. గత ప్రభుత్వం తీరు వల్లే పోలీసులు ఇలా తయారయ్యారని తెలిపారు. కొంతమంది అయితే ఏకంగా డబ్బులు తీసుకుంటున్నారనీ ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని పవన్‌కు చంద్రబాబు హామీ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిద్దామని చెప్పుకొచ్చారు. ఇకపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని అదుపులోకి తీసుకుంటుంది. అలాగే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులపైనా చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే కడప జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజుపై బదిలీ వేటు వేసింది. ఆయనతో పాటు మరికొందరి పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News