తిరుమల(Tirumala) ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్డుపైకి వచ్చిన ఏనుగులు కదలకుండా అక్కడే ఉండిపోయాయి. గమనించిన భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘాట్ రోడ్డులోని ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఏనుగులు సంచరిస్తున్నట్లు భక్తులు, వ్యాపారులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా ఏనుగులను తరిమేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- Advertisement -
కాగా ఇటీవల మెట్ల మార్గంలో చిరుతపులి సంచరిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏనుగులు రావడంతో నడక మార్గంలో వెళ్లేందుకు భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ అధికారులు భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.