ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో(AP Secretariat) భారీ అగ్ని ప్రమాదం(Fire accident) సంభవించింది. సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారంఅందుకున్న అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన ప్రమాదమా? లేక కుట్రనా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. కాగా రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, నారాయణ పేషీలకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. అగ్నిప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు.
Fire accident: ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం.. హోంమంత్రి ఆరా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES