Wednesday, December 4, 2024
Homeఆంధ్రప్రదేశ్CID Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై సస్పెన్షన్ వేటు

CID Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై సస్పెన్షన్ వేటు

CID Sanjay| ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొంతమంది ఐపీఎస్ అధికారులపై వేటు పడుతున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలువురు అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరో అధికారిపై కూడా వేటు వేసింది.

- Advertisement -

అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సమయంలో ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సీఐడీ చీఫ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. అలాగే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణ(Vigilance Investigation)కు ఆదేశించింది. తాజాగా విజిలెన్స్ విచారణలో అవినీతికి పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేసింది.

సంజయ్ గతంలో అగ్నిమాపక డీజీగా ఉండగా అగ్ని-ఎన్‌వోసీ(NOC) టెండర్ల ప్రక్రియలో అక్రమాలతో పాటు నిబంధనల అమలులో అవకతవకలకు పాల్పడినట్లుగా విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. గత ప్రభుత్వం హయాంలో అగ్ని పోర్టల్‌లో ఎన్‌వోసీ, హార్డ్‌వేర్‌ సరఫరా కోసం రూ.2.29 కోట్ల ఒప్పందాన్ని సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(Sautrika Technologies and Private Limited )కు సంజయ్‌ కట్టబెట్టారనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు ఆలిండియా సర్వీసెస్ (All India Services) రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Neerabh Kumar Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేకుండా విజయవాడ దాటి వెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News