Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Gangula: టిడిపి చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దు

Gangula: టిడిపి చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దు

గడప గడపకులో ఎమ్మెల్యే

శిరివెళ్ళ మండలం గోవిందపల్లే గ్రామంలోని 2వ సచివాలయం పరిధిలోని 5,6,18 వ వార్డుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్రా రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు వైకాపా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలను గురించి బుక్ లెట్ ద్వారా లబ్ధిదారులకు వివరించి అందిన సంక్షేమ పథకాలను సక్రమంగా తమ కుటుంబానికి వినియోగించుకోవాలని ఇంకా అర్హత ఉండి సంక్షేమ ఫలాలు అందరివారు సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు తెలపాలని అర్హత ఉంటే తప్పనిసరిగా సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే గంగుల అన్నారు. వార్డుల్లో సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు సమస్యలు ఉంటే వెంటనే తెలపాలని సమస్యలను తీర్చేందుకే మన ప్రభుత్వం ముందుందని అన్నారు.

- Advertisement -

ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని ప్రతి పేదవాడు కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆయన ఆశయమని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఎనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని ప్రతిపక్ష పార్టీలు కల్లబొల్లి మాటలతో మీ ముందుకు వస్తున్నారని గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా చూడాలని మీ అందరి ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించాలని ఎమ్మెల్యే గంగుల కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు వైకాపా నాయకులు ఇందూరు ప్రతాపరెడ్డి సలాం సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad