Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: కష్టపడి పని చేయండి మళ్ళీ అధికారంలోకి వస్తాం

Gangula: కష్టపడి పని చేయండి మళ్ళీ అధికారంలోకి వస్తాం

మంగళవారం టీడీపీలోకి వెళ్లి బుధవారం వైసీపీకి తిరిగి వచ్చిన..

ఇప్పటినుంచి కష్టపడి పనిచేసి, పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చుకునే బాధ్యత అందరికీ ఉందని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జెసిఎస్, సచివాలయ కన్వీనర్ల మండల కన్వీనర్లు సమావేశంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్రా రెడ్డి, ఎంపీపీలు గజ్జల రాఘవేంద్రారెడ్డి అమర్నాథరెడ్డి వీరభద్రుడుతో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అందించిందన్నారు. ప్రజలందరూ మన వైపే ఉన్నారన్నారు, ప్రజల కోసం ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ఘనత మనదే అన్నారు. 98% సంక్షేమాలు అర్హులైన వారందరికీ అందించామన్నారు. రాష్ట్రంలోని ఆళ్లగడ్డకు గుర్తింపు వచ్చిందన్నారు. నియోజకవర్గంలోనే అత్యధికంగా బోర్లు వేసిన ఘనత మనదే అన్నారు రైతులుకు ఇన్పుట్ సబ్సిడీ పంటనష్టం సహాయం చేయడంలో అన్నిటిలో మనమే ముందున్నామన్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్నామన్నారు. ప్రతి ఒక్కరం కష్టపడి పని చేస్తే మళ్లీ అధికారంలోకి తెచ్చుకునే బాధ్యతను తీసుకొని సక్రమంగా నిర్వర్తించాలని అందులో భాగంగా ఆరోగ్య బీమా నమోదు కార్యక్రమాన్ని గురువారం నుండి మీ మీ పరిధిలోని గృహసారధులు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. ఈ సమావేశంలో గంగుల రామిరెడ్డి గోపారం నరసింహారెడ్డి కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు, గూబగుండం వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

టిడిపి నుండి తిరిగి వైసీపీలోకి
మంగళవారం టీడీపీలో చేరిన చాగలమర్రి మండలం బ్రాహ్మణ పల్లెకు చెందిన రామకృష్ణ రెడ్డి ,అయ్యల రవి, బాబు,శోభన్ బాబు తిరిగి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సమక్షంలో సొంత పార్టీ వైఎస్ఆర్సిపిలో చేరారు. పట్టణంలోని గంగుల కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల వైఎస్సార్సీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కొన్ని కారణాలవల్ల టిడిపిలో చేరామని తిరిగి ఎమ్మెల్యే గంగుల ఆహ్వానం మేరకు తమ సొంత పార్టీ వైసీపీలో చేరామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాగలమర్రి మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, బ్రాహ్మణ పల్లె వైఎస్సార్సీపీ నాయకులు శ్రీనివాస రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మి రెడ్డి, శేషు, రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News