Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్బాబు బహిరంగ సభను విజయవంతం చేయండి

బాబు బహిరంగ సభను విజయవంతం చేయండి

చంద్రబాబు సభకు జనసమీకరణ

చెన్నమ్మ సర్కిల్ లో జరిగే చంద్రబాబు బహిరంగ సభకు తరలిరండి అంటూ గౌరు దంపతులు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు ఈ నెల 9 వ తేదీ శనివారం, సాయంత్రం 5:00 లకు, నంద్యాల జిల్లా పాణ్యo నియోజకవర్గం కల్లూరు చెన్నమ్మ సర్కిల్ లో జరిగే “బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ” కార్యక్రమం లో భాగంగా పాణ్యo మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభ కు విచ్చేస్తున్న సందర్భంగా గౌరు దంపతుల స్వగృహం మాధవి నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కల్లూరు, ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాలు, కల్లూరు అర్బన్ పరిధిలో ఉన్న 16 వార్డ్ ల ఇంచార్జిలు ముఖ్య నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు, గౌరు అభిమానులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భారీ సంఖ్యలో తరలి వచ్చి, ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గౌరు చరిత వెంకట రెడ్డి దంపతులు…

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి మరియు పాణ్యo నియోజకవర్గ అబ్జర్వర్ కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా , మాజి మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ యన్ వి రామకృష్ణ, నన్నురు విశ్వేశ్వర రెడ్డి, ఓర్వకల్లు పాణ్యం మండల అధ్యక్షుల్లు జయరామిరెడ్డి,గోవింద్ రెడ్డి,అర్బన్ వార్డ్ ఇంచార్జి లు ముఖ్య నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad