Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: 35 ఏళ్ల తరువాత అ'పూర్వ' కలయిక

Gonegandla: 35 ఏళ్ల తరువాత అ’పూర్వ’ కలయిక

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ గుడిలో వారంతా ఒకే చోట కలిసి చదువుకొని కలిసి పెరిగారు. 35 సంవత్సరాల తర్వాత ఒకే చోట చేరి ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకొని చదువుకునే రోజుల్లోనే జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఆనందంతో పులకించిపోయారు.

- Advertisement -

1988-89 బ్యాచ్..

ఈ వేడుకకు వేదికగా గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిలిచింది. మండల కేంద్రమైన గోనెగండ్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988-89 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత గోనెగండ్లలో తాము 1988-89లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని వారి వారి కుటుంబాల పరిస్థితులు, వారి వారి పిల్లల చదువులు, ఆర్థిక,ఆరోగ్య విషయాల గురించి ఒకరినొకరు చర్చించుకొని, తాము చదివిన పాఠశాలలో పూర్వ జ్ఞాపకాలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ స్నేహ సంబంధాలను ఇలాగే కొనసాగించుకుంటూ ఒకరినొకరు పరస్పరం సహకరించుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉండి సహకరించుకొని స్నేహ బంధాన్ని కొనసాగించుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 1988-89లో చదువు నేర్పిన గురువు మాధవ స్వామి పాల్గొని మాట్లాడుతూ పదవ తరగతి పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక పేరుతో మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని, అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని, తమ పిల్లలను ఉన్నత స్థాయి చదువులు చదివించాలని పూర్వ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా 1988-89 10వ తరగతి బ్యాచ్ విద్యార్థుల సహకారంతో నిరుపేద విద్యార్థి ఉస్మాన్ కు 47వేల రూపాయలను ఆర్థిక సాయం అందించారు. అనంతరం గురువు మాధవస్వామిని శాలువా పూలమాల మొమెంటోతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు జానకి రాముడు, ఎల్లప్ప, అబ్దుల్ సలాం, ప్రసాద్ శెట్టి, హాజీ మలంగ్, డాక్టర్ నాగరాజ్ , సూర్య ప్రకాష్ లతో పాటు మరో 40 మంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News