Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Gummanuru Jayaram: 'గడప గడప'లో మంత్రికి ఘన స్వాగతం

Gummanuru Jayaram: ‘గడప గడప’లో మంత్రికి ఘన స్వాగతం

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం హొళగుంద మండలం నేరణికి సచివాలయం పరిధిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆలూరు తాలూకా ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ వన్నమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సచివాలయం పరిధిలోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాలలో తాగునీటీ సమస్య మరియు మహిళలకు బాత్రూములు, డ్రైనేజ్ నిర్మించాలని కోరారు. దానికోసం సచివాలయానికి వచ్చిన 20 లక్షల లో 10 లక్షలు కేటాయించాలని మంత్రి తెలిపారు. మిగిలిన 10 లక్షల లో ఐదు లక్షలు నేరణికితాండ కి, ఐదు లక్షలు కొత్తపేట కి కేటాయించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు ప్రతి ఇంటివద్దా ప్రజలు ఆనందంతో స్వాగతం చెబుతున్నారు.అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరింస్తూ తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

- Advertisement -

తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని గ్రామస్తులు భరోసా ఇచ్చారు.ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బావ కొగిలతోట శేషప్ప,వైసీపీ సీనియర్ నాయకులు సోమప్ప, వీర నాగప్ప,వైసీపీ సీనియర్ నాయకులు బోయ తిమ్మప్ప,వైసిపి యువ నాయకులు ఎస్.కె. గిరి, మరిమల్ల, రవి స్వామి,రమేష్, మఠం మహేష్,ఎంపీపీ తనయుడు ఈసా,సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీడీవో,ఏపీఎం,హౌసింగ్ ఏఈ,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,హొళగుంద ఎస్సై శ్రీనివాసులు,హాలహర్వి ఎస్సై నాగేంద్ర,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News