Saturday, May 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Heat wave: రేపు ఏపీవో 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

Heat wave: రేపు ఏపీవో 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

పార్వతీపురం సాలూరులో 43.9°C

మంగళవారం 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
బుధవారం 38 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 135 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

- Advertisement -

రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(63) :-

పార్వతీపురంమన్యం 13, శ్రీకాకుళం 15, విజయనగరం 22, అల్లూరి 3, అనకాపల్లి 4, కాకినాడ 3, తూర్పుగోదావరి 2, ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(130) :-

శ్రీకాకుళం 14 , విజయనగరం 5, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 11, విశాఖపట్నం 3,
అనకాపల్లి 12, కాకినాడ 16, కోనసీమ 9, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 13, కృష్ణా 7, ఎన్టీఆర్ 7, గుంటూరు 7, పల్నాడు 4 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్లో
https://apsdma.ap.gov.in/files/d4da70e8515548a82577b067749efa71.pdf

సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 43.9°C, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3°C,
అల్లూరి జిల్లా యెర్రంపేటలో 43.1°C, పల్నాడు జిల్లా విజయపూరిలో(మాచెర్ల),విజయనగరం జిల్లా రాజాంలో 42.8°C, అనకాపల్లి గడిరైలో 42.7°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 38 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 75 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News