Sunday, December 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: నేను ఇతడికి పెద్ద అభిమాని అయ్యాను: లోకేశ్

Nara Lokesh: నేను ఇతడికి పెద్ద అభిమాని అయ్యాను: లోకేశ్

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)ని ఇమిటేట్‌ చేసిన ఓ వ్యక్తి వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో మంత్రి నారా లోకేశ్‌( Nara Lokesh) వరకు చేరడంతో ఆయన దీన్ని తన ఎక్స్ ఖాతాలో షేర్‌ చేశారు. ‘నేను ఇతడికి అభిమానిగా మారిపోయాను. చంద్రబాబు గారిలా మాట్లాడడానికి, కనిపించడానికి అతడు ఎంత కష్టపడ్డాడో చూడండి’ అని రాసుకొచ్చారు.

- Advertisement -

కాగా ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఓ మిమిక్రీ ఆర్టిస్టు అచ్చం చంద్రబాబు వేషధారణలో హాజరయ్యారు. వేదికపైకి వచ్చి ఆయనలాగే మాట్లాడి వధూవరులను ఆశీర్వదించారు. చంద్రబాబు మాదిరే మాట్లాడి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News