Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: రైతులను నట్టేట ముంచిన జగన్ సర్కారంటూ కామ్రేడ్ల నిరసన

AP: రైతులను నట్టేట ముంచిన జగన్ సర్కారంటూ కామ్రేడ్ల నిరసన

నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ విమర్శించారు. ఎమ్మిగనూరు పట్టణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 10వ జిల్లా మహాసభలలో రామకృష్ణ పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం నుండి గాంధీ సర్కిల్, షరాఫ్ బజార్, సోమేశ్వర సర్కిల్ , ట్యాంక్ బండ్, కూరగాయల మార్కెట్ మీదగా సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం సోమప్ప సర్కిల్ లో బహిరంగ సభ రైతు సంఘం జిల్లా నాయకులు పంపన గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు.

- Advertisement -

ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరై కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో దివాలా కోరు ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. కరువు కాటకాలతో వేలాది ఎకరాలు నష్టపోయి, రైతన్నలందరూ కష్టాలను ఎదుర్కొని, ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు మండలాలుగా ప్రకటించారే కానీ ఇప్పటివరకు ఎలాంటి కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను కూడా కలవడానికి వీలు లేకుండా సీఎం ఉన్నారని, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజా ప్రతినిధులకే దిక్కు లేకపోతే ముఖ్యమంత్రి, ప్రజలకు ఏమి సేవ చేస్తారని ప్రశ్నించారు. ఏ రకంగా పరిపాలన అందిస్తున్నాడో ఆలోచించాలని అన్నారు.

ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామచంద్రయ్య, కెవివి ప్రసాద్ లు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఈ జిల్లాలో ఇంతవరకు కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం దారుణమని అన్నారు. కరువు కాటకాలతో కర్నూలు జిల్లా కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి పట్టనట్టు ఉండడం సమంజసం కాదని అన్నారు. రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కేంద్ర కరువు పరిశీలన బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించి, రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పటివరకు వెల్లడించడం జరగలేదని అన్నారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల బాధలను పట్టించుకోని, కరువు సహాయక చర్యలు చేపట్టి,రైతులను ఆదుకోవాలని వారు కోరారు.

ఈ బహిరంగ సభలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీరెడ్డి, జగన్నాథం, సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప, పట్టణ కార్యదర్శి రంగన్న, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్, రామకృష్ణారెడ్డి, అజయ్ బాబు, శ్రీరాములు, కారుమంచి విరుపాక్షి, రాజసాహెబ్, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News