Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Mahanandi: చంద్రబాబు త్వరగా విడుదల కావాలని మహానందిలో ప్రత్యేక పూజలు

Mahanandi: చంద్రబాబు త్వరగా విడుదల కావాలని మహానందిలో ప్రత్యేక పూజలు

బాబుకు మద్దుతుగా టీడీపీ నేతల ప్రత్యేక పూజలు

మహానంది పుణ్యక్షేత్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని టిడిపి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త బన్నురు రామలింగారెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు త్వరగా విడుదల కావాలని, క్షేమంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ఉల్లి మధు, ఆర్.ఎస్ గాజులపల్లె సర్పంచ్ అస్లాం బాషా, టిడిపి నాయకులు చింతం రాముడు, క్రాంతి కుమార్ యాదవ్, జనార్దన్ రెడ్డి, కాకర్ల శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News