గుంటూరు జిల్లా మేడికొండూరులో వర్షంలోనూ జగన్ అభిమానులు పోటెత్తారు. వర్షం లోనూ బారులు తీరి ముఖ్యమంత్రి కోసం వేచిచూసిన ప్రజలు ఆయన్ను కలిశాక ఇంటికెళ్లారు. రోడ్డుకిరువైపులా నిల్చొని వర్షంలో తడుస్తూనే ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు మహిళలు, అవ్వాతాతలు, అన్నదాతలు.
గుంటూరులో జన సునానీని చూసి విపక్షాలు విస్తుపోయాయి. గుంటూరు నగర శివారు పేరేచర్ల నుంచి ముఖ్యమంత్రి బస్సుయాత్రకు ఎదురేగి స్వాగతం పలికారు ప్రజలు. కిలోమీటర్ల మేర బారులు తీరిన యువకులు, మహిళలు, అవ్వాతాతలు, చిన్నారులతో సహా తల్లులు, ముఖ్యమంత్రితో పాటు గుంటూరు రోడ్‌షోలో కదం తొక్కిన జన ప్రవాహం.
16 కిలోమీటర్ల మేర ముఖ్యమంత్రి వైయస్.జగన్‌తో ప్రవాహంలా కదిలిన జనంతో, సుమారు 16 కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారిపోయింది రోడ్‌షో. చిన్నారులు, యువకులు, అవ్వాతాతలు, అన్నదాతలు… ఆరేళ్ల నుంచి అరవైఏళ్ల వరకు ఒక్కటే నినాదంతో ప్రతిధ్వనించిన గుంటూరు.