శ్రీకాకుళం జిల్లా పలాస బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్. జగన్ తో సెల్ఫీ దిగాలని పలాసకు చెందిన ఏడో తరగతి విద్యార్ధి టి. దిలీప్ సభా ప్రాంగణంలో బారికేడ్లుపై ఎక్కగా.. . వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆ విద్యార్థిని వారించారు. అదే సమయంలో సీఎం వైయస్. జగన్ అలాంటి ప్రమాదకర ప్రయత్నం చేయవద్దని చెబుతూనే…. విద్యార్ది దిలీప్ తో సెల్ఫీ దిగి ఆత్మీయంగా హత్తుకున్నారు.


