ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష పధకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం వైయస్. జగన్. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, మహిళా శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ ఎం జానకి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ డాక్టర్ బి చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సలహాదారు గోవింద హరి, ఐఎంఏ, ఆశా, నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


