Friday, July 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో మెగా జాబ్ మేళా

Nandyala: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో మెగా జాబ్ మేళా

24 మల్టీ నేషనల్ కంపెనీలు, 4వేల ఉద్యోగాలు

నంద్యాల పట్టణంలోని పీఎస్సీ అండ్ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవి రెడ్డి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు 24 మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపుగా 4 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. వేలాదిమంది నిరుద్యోగ యువత జాబ్ మేళాలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. నిరుద్యోగ యువత ఈ జీవితకాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత భవిష్యత్తును పొందాలని ఎమ్మెల్యే కోరారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విద్యా వైద్య రంగాలపై దృష్టి సారించి అనేక విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఉన్నత విద్యాశాఖ ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇటువంటి సువర్ణ అవకాశాన్ని విద్యార్థులు తమ జీవిత కాల అవకాశంగా భావిస్తూ ప్రతిభను కనబరిచి మంచి ఉద్యోగాలను సాధించాలని కోరారు.

వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే కరోనా మహమ్మారితో రెండు సంవత్సరాల ఎంతో విలువైన కాలం కోల్పోయామని, అయినను సీఎం జగన్మోహన్ రెడ్డి మొక్కవోని ధైర్యంతో మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి రాష్ట్ర పురోగతికి బాటలు వేశారని అన్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన అనేక ప్రాజెక్టులకు తిరిగి జీవం పోసి ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. విద్య , వైద్య, పారిశ్రామిక రంగ అభివృద్ధి కొరకు అనేక సంస్కరణలు చేపట్టారని, తద్వారా పేరు గన్న మల్టీ నేషనల్ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం వైపు తమ పెట్టుబడులను పెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.

భవిష్యత్తులో నంద్యాల జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మరిన్ని జాబ్ మేళాలను నిర్వహించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ జాబ్ మేళాలో నంద్యాల జిల్లా పరిదిలోని 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అనేక ప్రాంతాల నుండి వేలాదిగా నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గురువయ్య, మహబూబాబాష,జేకేసీ కోఆర్డినేటర్ పార్వతి, ప్రతాప్రెడ్డి, డీఎస్ఓఓ ఏపీఎస్ఎస్ఓసి మెంటర్లు, అధ్యాపక బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News