కౌతాళం మండలం హాల్వి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నేతలిద్దరూ ప్రతి లబ్ధిదారునితో ప్రత్యేకంగా గడప గడపకు వెళ్లి ప్రభుత్వం తరఫున అందిన సంక్షేమ పథకాల, ప్రభుత్వం చేసిన మేలు గురించి వివరించారు. లబ్ధిదారుల నుంచి వారి యోగక్షేమాలు విచారిస్తూ, వారికి ప్రభుత్వం తరఫున ఏమైనా సంక్షేమ పథకాలు పొందడానికి అర్హత ఉండి కూడా పథకాలు రాకున్నా వారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
గడప గడపకు వెళ్ళిన సమయంలో ఓ వృద్ధురాలికి సాంకేతిక కారణాల వల్ల ఆమెకు రావాల్సిన ఒక నెల వృద్ధాప్య పెన్షన్ రాకపోవడంతో బాధలో ఉన్న వృద్దరాలిని గుర్తించి వృద్ధురాలి పెద్ద కొడుకుగా నేనున్నానంటూ తక్షణమే 3,000 రూపాయలు అందించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలన్నిటినీ తొందరగా అధికారులు పరిష్కరించాలని లబ్ధిదారుల సమక్షంలోనే సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ దశరథ రెడ్డి, మండల నాయకులు ప్రహల్లాద దేశాయి, జడ్పిటిసి ప్రియదర్శిని ఎంపీపీ అమరేష్, కోఆప్షన్ మేంబర్ మాబుసాబు, వైస్ ఎంపీపీ బుజ్జిస్వామి, రామన్నగౌడ, ఏకంరెడ్డి, చెన్నబసప్ప, బసవప్రభు, సిద్ధనగౌడ, సర్పంచ్ క్రాంతి, ఎంపీడీవో సుబ్బరాజు, మరెగౌడ, సర్పంచ్ పాల్ దినకరన్, ఎంపీటీసీ లింగన్నగౌడ, వడ్డే రాముడు పాల్గొన్నారు.