Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Kothapalli: ప్లాస్టిక్ నిషేధం చేద్దాం

Kothapalli: ప్లాస్టిక్ నిషేధం చేద్దాం

కాలుష్యం, ప్లాస్టిక్ నియంత్రణ పద్ధతులు అవలంభించడం ద్వారా వాతావరణ, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు దోహదం చేస్తామని కొత్తపల్లి మండల కేంద్రం నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల రక్షణ అధికారులు తెలిపారు. అందులో భాగంగా కొత్తపల్లి ఎన్.ఎస్.టి.పి. కార్యాలయం అధికారి ఎఫ్.ఎస్. ఒ. ఆధ్వర్యంలో కార్యాలయ పరిసర ప్రాంతాలను సిబ్బందితో కలసి అధికారులు ప్లాస్టిక్, వ్యర్థ పదార్థాలను, ఏరివేసి అగ్నికి ఆహుతి చేశారు. ఈ సందర్భంగా ఎఫ్.ఎస్. ఒ జ్యోతీశ్వర్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ భాద్యతగా ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు నియంత్రించడానికి కృషిచేసి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా భూమి మీద వున్న ప్రాణులకు, వృక్షములను, జంతుజాలంలకు రక్షణ కల్పించాలని కోరారు. ప్లాస్టిక్ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే రాబోయే కాలంలో భూమి మీద జంతు, జీవ, జల రాశులకు ప్రాణ ముప్పు పొంచివుందని అన్నారు. ఈవిషయంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్.బి. ఒ.బాలయ్య, రాంబాబు, కృష్ణ కాంత్, కొత్తపల్లి ప్రొటెక్షన్ వాచర్స్, అటవీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad