Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్KTR: యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉంది

KTR: యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉంది

ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తే అబ్బురమనిపిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో 24 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రులు సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీతో కలిసి ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ యూనిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ కోసం ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పథకం లబ్ధిదారులకు మున్సిపల్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు ఇస్తామన్నారు. సమాజంలో అన్ని కులమతాల మధ్య గీతలను కరోనా చెరిపివేసిందని పేర్కొన్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితే కులవ్యత్యాసాలు రూపు మాసిపోతాయన్నారు.

- Advertisement -

తెలంగాణ సాధించిన విజయాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని విమర్శించారు. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ 30 శాతం పంచాయతీ అవార్డులను గెలుచుకున్నదని పేర్కొన్నారు. కొత్త పారిశ్రామిక వేత్తలను మరింతమంది యువతను ప్రోత్సహించాలని సూచించారు. ఎస్టీ యువ వ్యాపారవేత్తలను మున్సిపల్‌ శాఖ ద్వారా ప్రోత్సహిస్తామని హామీనిచ్చారు. ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కొరుకంటి చందర్, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, సురభి వాణీ దేవి, ఏవి రెడ్డి, కార్పోరేటర్ కవితా రెడ్డి, మాజీ ఎంపీ సీతారామ్ నాయక్, ట్రైకార్ చైర్మన్ రామ చంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, మేయర్ గద్వాల విజయలక్షి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ శాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చొంగ్తు, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News