స్పెషల్ సమ్మరీ రెవిజన్ 2024లో భాగంగా ఈనెల 4, 5 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం విజయవంతమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి సృజన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1.1.2024 తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ, యువకులు శనివారం, ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు సంబంధిత పోలింగ్ కేంద్రాలకి వెళ్లి తమ ఓటు హక్కును నమోదు చేసుకొని అలాగే తమ పేరు చిరునామా మార్పుల కోసం సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓ లను సంప్రదించి దరఖాస్తులను సమర్పించారు.
జిల్లా వ్యాప్తంగా 4, 5 తేదీల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా జిల్లావ్యాప్తంగా 2186 పోలింగ్ కేంద్రాలు ఉండగా 2186 బిఎల్ఓ లను నియమించినట్లు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ప్రత్యేక నమోదు ఓటర్ కార్యక్రమంలో ఫారం 6, 8636 దరఖాస్తులు, ఫారం 6ఏ, 11 దరఖాస్తులు, ఫారం 6 బి, 262 దరఖాస్తులు, ఫారం 7, 2140 దరఖాస్తులు, ఫారం 8, 2990దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.