కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన వ్యక్తిగత పనుల నిమిత్తం యూరోప్ దేశానికి వెళుతున్నారు. మంగళవారం అధికారిక సమావేశం అనంతరం హైదరాబాద్ కు వెళ్లి అక్కడి నుండి యూరోప్ దేశానికి వెళుతున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు వెలవడ్డాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఆగస్టు 30వ తారీకు నుంచి సెప్టెంబర్ 8వ తారీకు వరకు అధికారికంగా సెలవు మంజూరు అయినట్లు ప్రభుత్వ సిఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పది రోజులపాటు కర్నూలు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఇన్చార్జి కలెక్టర్ గా విధులు నిర్వహించనున్నారు.
Kurnool: విదేశాలకు జిల్లా కలెక్టర్
వ్యక్తిగత హోదాలో యూరప్ కు కలెక్టర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES