Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం

Kurnool: సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం

ఆధునిక భారతదేశంలో గొప్ప సంస్కర్త వైయస్ జగన్

కర్నూలు నగరంలో జిల్లా పరిషత్ ప్రాంగణంలో కర్నూలు మండల పరిషత్ కమిటీ హాలులో సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం బడుగు బలహీన వర్గాల ఐక్య వేదిక సభ్యులు మద్దూరు సుభాష్ చంద్రబోస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ CH మద్దయ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎస్ఆర్సీపీ, దేవపూజ ధనుంజయ్య ఆచారి, రాష్ట్ర కార్యదర్శి బిసి విభాగం వైఎస్ఆర్సీపీ పార్టీ బత్తుల లక్ష్మికాంతయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ యునుస్ భాషా, మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. ఈకార్యక్రములొ మద్దూరు సుభాష్ చంద్రబోస్, CH మద్దయ్య మాట్లాడుతూ సామాజిక న్యాయం SC ST BC మైనార్టీలకు సామాజిక న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలిపించే గురుతర భాద్యత మన SC ST BC మైనార్టీల పై ఉంది అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకులు దేవపూజ ధనుంజయ్య ఆచారి, బత్తుల లక్ష్మికాంతయ్య మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత చట్ట సభల్లో అన్ని సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన అభినవ పూలే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బెల్లం మహేశ్వర రేడ్డి వ్యవసాయ సలహా మండలి చైర్మన్, మైనార్టీ నాయకులు షేక్ యూనూస్ భాషా మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమముతో పాటు పెద వర్గాలకు కృషి చేసిన పేద వర్గాలకు సంక్షేమం అభివృద్ధి అధిక ప్రాధాన్యత ఇచ్చి బడుగు బలహీన ఆశాజ్యోతి CM వై.ఎస్ జగన్ అని అన్నారు. కార్యక్రమంలో SV మోహన్ రెడ్డి సతీమణి విజయ మనోహరి మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ రేణుకమ్మ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తూ పేద ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచిన వ్యక్తి మన CM అని అన్నారు. ఈకార్యక్రమంలో BC SC ST మైనార్టీ ప్రజాసంఘాల నేతలు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, ప్రభుదాస్ కొమ్ముపాలేం శ్రీనివాసులు, చెన్నమ్మ, సోమసుందరం, బ్రహ్మయ్య ఆచారి, చంద్రికమ్మ, కల్పన, కుర్వ శ్రీనివాసులు, రోషన్ అలి, నక్కలమిట్ట శ్రీనీవాసులు, ధస్తగిరి నాయుడు, అయ్యన్న యాదవ్, ధనవిజేయడు, బోయ శ్రీరాములు, గడ్డం రామకృష్ణ, బేతం కృష్ణుడు, MRPS గోపి, సుధాకర్, క్రిష్ణోజీరావు, మునెమ్మ, కార్పొరేటర్ కరుణాకర్, నాగేంద్ర, షరిఫ్, జయకాంత్, ముర్తి, శివ శంకర్ సత్యనారాయణాచారి చక్రదర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News