Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: జెమ్ కేర్ హాస్పిటల్ రికార్డు

Kurnool: జెమ్ కేర్ హాస్పిటల్ రికార్డు

గుండె ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

ఒకే రోజు 800 మందికి పైగా ఉచితంగా గుండె స్క్రీనింగ్ పరీక్షలు చేసి కర్నూల్ లోని జిమ్ కేర్ హాస్పిటల్ రికార్డింగ్ నెలకొల్పింది. ప్రపంచ హృదయ దినం సందర్భంగా ఈ పరీక్షలు చేయడంతో పాటు ఆరువేల మందితో గుండెను భద్రంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో 6,000 మందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర చెరుకు, సిటివీయస్ సర్జన్ డాక్టర్ సుధీర్ కుమార్, కార్డియాక్ అనేస్తేషియా డాక్టర్ కే. ఆదిత్య మాట్లాడుతూ మనిషి అవయవాలలో ఎంతో ప్రాధాన్యత కలిగిన గుండెకు ఎలాంటి అనారోగ్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మంచి ఆహారం తీసుకుంటూ చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా వుంటే గుండె పనితీరు బాగా వుంటుందన్నారు.
వరల్డ్ హార్ట్ డే సందర్బంగా ‘జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్’ అందిస్తున్న ఉచిత గుండె (స్క్రీనింగ్ టెస్టు లు) వైద్య పరీక్షలు పాటు ఒక కొత్త ప్యాకేజీ రూ. 499 లకే ఈసీజీ , 2d ఎకో, కార్డియాలజీ కన్సల్టేషన్ పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. హాస్పిటల్ ఏం.డి., సి ఈ ఓ డాక్టర్ యెస్. వి.చంద్ర శేఖర్, డాక్టర్ జి.వి.యెస్ రవి బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నారు. బి.పి, షుగర్ లను పెరగకుండా చూసుకోవాలన్నారు. ఇంకా బరువును నియంత్రించుకోవడం, కొలెస్ట్రాల్ పెరగకుండా, దూమ పానం, మద్యపానం లకు దూరంగా వుండాలన్నారు. ప్రతి రోజూ యోగ చేయడం, కనీసం రోజుకు ఒక అరగంట నడవడం వంటివి చేయడం ద్వారా ఎలాంటి గుండె వ్యాధి రాకుండ ఆరోగ్యంగా వుండవచ్చన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ యాజమాన్యం కార్డియాలజీ, సి టి వీ యస్ విభాగాలలో వైద్య సేవలందించిన వారిని ఈ సందర్భంగా సత్కరించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో. సి. ఓ. ఓ. డాక్టర్ గణేష్ ,మార్కెటింగ్ హెడ్ రమణ బాబు,ఆపరేషన్స్ హెడ్ నదీమ్ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News