Tuesday, October 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: తెలుగుదేశం గూటికి కప్పట్రాళ్ల బొజ్జమ్మ

Kurnool: తెలుగుదేశం గూటికి కప్పట్రాళ్ల బొజ్జమ్మ

ఈరోజు బాబు సమక్షంలో..

వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్ష పదవికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్టు కప్పట్రాళ్ల బొజ్జమ్మ ప్రకటించారు. నేడు హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసంలో టీడీపీ పార్టీలోకి చేరుతున్నట్టు ప్రకటించారు. 2019 ఎన్నికల వరకు టీడీపీలో ఉన్న వీరు కోట్ల కుటుంబం టీడీపిలో చేరి ఆలూరు టీడీపీ అభ్యర్థిగా కోట్ల సుజాతమ్మకు చంద్రబాబు అవకాశం ఇవ్వడం వల్ల వైసీపీకి దగ్గరయ్యారు. గత ఏడాది జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొని 2024 ఆలూరు సీటు ఆశించారు. అయితే జగన్ వీరికి మొండి చేయి చూపి విరూపాక్షికి సీటు యిచ్చారని, టీడీపీ నుండి ఆలూరు టీడీపీ ఇంచార్జి కోట్ల సుజాతకు కూడా చంద్రబాబు సీటు ఇవ్వకుండా 2014లో టీడీపీ తరపున పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన వీరభద్రగౌడకు 2024 సీటు ఇచ్చారని ఆరోపించారు. దీంతో కోట్ల వారు ఆలూరు నుండి వెళ్లిపోవడంతో తిరిగి తమ సొంత పార్టీ టీడీపీ అని అందులోకి వెళుతున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News