Saturday, July 27, 2024
HomeతెలంగాణTeluguprabha Effect: తెలుగుప్రభ కథనానికి స్పందన

Teluguprabha Effect: తెలుగుప్రభ కథనానికి స్పందన

తెలుగుప్రభకు థాంక్స్ చెప్పిన స్థానికులు

గార్ల మండల కేంద్రంలోని పలు వార్డులలో మంగళవారం దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. సోమవారం తెలుగు ప్రభ దినపత్రిక జిల్లా ఎడిషన్ లో దోమలమయం రోగాల భయం అనే శీర్షికతో ప్రచురితమై వచ్చిన కథనానికి గార్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి స్పందించి, పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించడంతో రంగంలోకి దిగిన వారు ఐదు వార్డులలో నిల్వ ఉన్న నీటిని తొలగించి కాలువలలో పూడిక తీత పనులు చేపట్టి మురికి కాలువలోని చెత్తాచెదాలని పిచ్చి మొక్కలు మట్టిని తొలగించారు.

- Advertisement -

దోమల లార్వా నాశనం చేసేందుకు ఆయిల్ బాల్స్ వేశారు తాసిల్దార్ బజార్ శివాలయం బజార్ ముస్లిం బజార్ బెస్త బజార్ లలో నిర్వహించిన పారిశుద్ధ్య పనులను శాంటేషన్ ఇంచార్జి పి.దాస్ తో కలిసి కార్యదర్శి కుమార స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైడు కాలువలో అడ్డుగా కట్టలు రాళ్లు చెత్తాచెదారం వేయడం వల్ల నీరు నిలిచి ఉన్నట్లయితే ఆయా యజమానులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని వారికి నోటీసులు ఇచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు చాలా రోజుల నుంచి కాలువలలో పేరుకుపోయిన వ్యర్ధాలను పాశుద్ధ్య కార్మికుల సహాయంతో తొలగించామన్నారు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాలలో నీటిని తొలగిస్తూ ఆయిల్ బాల్స్ స్పెయిన్ ఫాగింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టి సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

తెలుగు ప్రభ దిన పత్రికలో దోమల స్వైర విహారం పై కథనం ప్రచురితం కావడంతో సైడు కాలువలు శుభ్రం దిశగా తోడ్పాటు అందించిన పత్రిక యాజమాన్యానికి, రిపోర్టర్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులునరేష్ కిరణ్ సతీష్ ప్రేమ్ కుమార్ రాజశేఖర్ ప్రభాకర్ శ్రీనివాస్ బాలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News