మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధి చెందిన కనక సోమేశ్వర దేవస్థానం కొండ మీదికి ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం, ఒడ్డెర కాలనీలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ దావ వసంత, బి ఆర్ యస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ లతో కలిసి శంకుస్థాపన చేసారు. మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. ఘాట్ రోడ్ నిర్మాణానికి పదికోట్ల రూపాయలు మంజూరయ్యాయి.
ఈ సందర్బంగా ఈశ్వర్ మాట్లాడుతు మండల ప్రజల చిరకాల కోరిక తీర్చుతున్న ప్రభుత్వంకు ధన్యవాదాలు తెలిపారు. తన చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం సంతోషకరం అని, అభివృద్ధి అనేది కెసిఆర్ తోనే సాధ్యం అని అన్నారు. సంజయ్ ని ఆశీర్వాదించాలని కార్యకర్తలను కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున తప్పకుండా సోమన్న పైకి భక్తిశ్రద్ధలతో వస్తానని, నియోజకవర్గంలో గల అన్ని బ్రిడ్జిలు, రోడ్డుల నిర్మాణం పూర్తి చేశామని కోరుట్ల నుండి ఎటు పోయినా డబుల్ రోడ్డులు చేశామని మల్లాపూర్ మోడల్ స్కూల్ దారికి కూడా నిధులు మంజూరయ్యాయని త్వరలో దాన్ని కూడా ప్రారంభిస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు రైతు బీమా, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, బీసీ బందు, దళిత బంధు లాంటి గొప్ప పథకాలు నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తన వారసుడైనా సంజయ్ ని ప్రజలు ఆశీర్వాదించాలని అన్నారు. జడ్పిటిసి ఎంపీపీ సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.