Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Mandouse Cyclone Update: తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం..ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

Mandouse Cyclone Update: తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం..ఈ ప్రాంతాలకు భారీ వర్షసూచన

డిసెంబర్ 8న తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం, కారైక్కాల్ ప్రాంతాల్లో మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈ సాయంత్రానికే తుపానుగా మారవచ్చని పేర్కొంది. ఈ రోజు మధ్యాహ్నానికి చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ తుపానుకు మాండోస్ అని నామకరణం చేయనున్నారు. రేపు ఉదయానికి ఈ తుపాను ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరువలోకి రానుంది. తుపాను ప్రభావంతో.. డిసెంబరు 8 సాయంత్రం నుంచి డిసెంబరు 9వ తేదీ ఉదయం వరకు తీరంవెంబడి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆపై క్రమంగా గాలుల తీవ్రత పెరగనుందని ఐఎండీ తెలిపింది.

- Advertisement -

డిసెంబర్ 8న తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతం, కారైక్కాల్ ప్రాంతాల్లో మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 8 నుండి 10వ తేదీ మధ్యలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలోని కోస్తా భాగాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షసూచన ఉండొచ్చని పేర్కొంది. తుపాను తీరానికి చేరువయ్యే కొద్దీ వర్షాలు పెరుగుతాయని వెల్లడించింది. ముఖ్యంగా డిసెంబరు 9 నుండి 11 మధ్యలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. డిసెంబర్ 10న తుపాను తమిళనాడు – దక్షిణ కోస్తాల మధ్య తీరం దాటినా..డిసెంబర్ 13వ తేదీ వరకూ తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మత్స్యకారులు డిసెంబర్ 10 వరకూ వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News