Tuesday, April 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Durgesh: ఆతిథ్య రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా 9,10 తేదీల్లో ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన

Durgesh: ఆతిథ్య రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా 9,10 తేదీల్లో ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన

ఆతిథ్య రంగంలో( hospitality sector) పెట్టుబడులే లక్ష్యంగా ఏప్రిల్ 9,10 తేదీల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముంబయిలో పర్యటించనున్నారు. ముంబయి పోవై లేక్ లో 8-10వ తేదీ వరకు జరుగుతున్న దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ లో మంత్రి దుర్గేష్ పాల్గొననున్నారు.

- Advertisement -

రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలు వివరించి ఇన్వెస్టర్లను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసా కల్పించనున్నారు. పర్యాటక రంగంలో భారీగా ఉపాధి అవకాశాల కల్పన,రూ.25,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తోన్న మంత్రి కందుల దుర్గేష్ ఇప్పటికే రూ.1200 కోట్లకు పైగా పెట్టుబడులు రాబట్టారు.

8 ఎంవోయూలు కుదుర్చుకున్నారు. మంత్రి దుర్గేష్ తో పాటు పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట ముంబయి పర్యటనకు వెళ్లనున్నారు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కాన్ఫరెన్స్ కు వెళ్తున్న బృందం అక్కడికి హాజరయ్యే దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత హోటల్స్ గ్రూప్స్ తో ఏపీ నూతన పర్యాటక పాలసీ, పర్యాటక రంగానికి పరిశ్రమహోదా తదితర వివరాలు వెల్లడించి పెట్టుబడులను ఆకర్షించనుంది.

వర్క్ షాప్ తో పాటు పదుల సంఖ్యలో వివిధ హోటల్స్ ప్రతినిధులతో భేటీ కానుంది. కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానం ప్రకటించాక ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో హోటల్స్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తిని కనబరిచాయి. ఈ క్రమంలో రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలో 50,000 గదుల ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వానికి ఇదొక మంచి వేదిక కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News