యూకే విద్యను అభ్యసిస్తున్న అఖిల్ అనే 11 ఏళ్ల బాలుడిని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసు నుంచే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న అఖిల్.. మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించిన అజ్యూర్, డేటా సెక్యూరిటీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికెట్లు పొందాడు. ఈ సందర్భంగా అమరావతిలో జరగనున్న సమాచార, సాంకేతికాభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో లోకేశ్ కలిశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు.

“టెక్నాలజీలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న మన రాష్ట్రానికి చెందిన 11 ఏళ్ల అఖిల్ ఆకెళ్ల, తన తండ్రితో కలిసి ఉండవల్లి నివాసంలో నన్ను కలిశారు. యూకేలో విద్యను అభ్యసిస్తున్న అఖిల్ చిన్న వయసులోనే మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా, సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషన్లు పొందాడు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్ లలో పాల్గొన్నాడు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభ చూపిస్తున్న అఖిల్ ను ఈ సందర్భంగా అభినందించాను” అని పేర్కొన్నారు.
