Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్పేదల ఆరోగ్య పరిరక్షణకు జగనన్న సురక్ష

పేదల ఆరోగ్య పరిరక్షణకు జగనన్న సురక్ష

జగనన్న సురక్షలో ఎమ్మెల్యే

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నందు నేడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బొగ్గులైన్, రైతు నగరం, క్రాంతి నగర్, బొమ్మల సత్రం ఊడుమలపురం, వెంకటేశ్వర పురం, సంబంధించి న వారికి నేడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకమే జగనన్న సురక్ష అని ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి పేదవానికి ఆరోగ్య రక్షగా ఉపయోగపడుతుందని వివరించారు.

పట్టణం, గ్రామాల్లో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు స్పెషలిస్ట్ డాక్టర్ల చేత పరీక్షలు చేయించుకుని వారి సూచనల ప్రకారం మందులు వాడుతూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని రూపొందించి ఇంటికి వైద్యులు వెళ్లి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని తగిన సూచనలు ఇస్తూ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెరుగైన చికిత్సలు వైద్యం అందిస్తున్నారని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News