ఏపీ శాసనమండలి సభ్యుడిగా జనసేన నేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు(Nagababu) ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు నాగబాబు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
- Advertisement -
అనంతరం నాగబాబు సతీసమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించారు. అలాగే నాగబాబుకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేసి శాలువా కప్పి, వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని నాగబాబు తెలిపారు.
