హీరో నాగచైతన్య(Naga Chaitanya), దర్శకుడు చందూ మొండేటితో కలిసి విజయవాడలోని కనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు వేద ఆశీర్వచనాలిచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నాగచైతన్య నటించిన ‘తండేల్'(Thandel) మూవీ థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతున్న సంగతి తెలిసిందే. చైతన్య కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. చైతూ, సాయి పల్లవి జోడీకి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో రెండు రోజుల్లో రూ.41.20 కోట్ల వసూళ్లు సాధించి రూ.100 కోట్ల దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ సక్సెస్ టూర్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలోని శైలజా థియేటర్లలో అభిమానులను మూవీ యూనిట్ పలకరించింది. ఈ పర్యటనలో భాగంగా అమ్మవారి ఆశీస్సులు కోసం చైతన్య అండ్ యూనిట్ ఇంద్రకీలాద్రి వచ్చారు.