Tuesday, September 10, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: తహశీల్దార్ ను కలసిన టీడీపీ నేతలు

Nandavaram: తహశీల్దార్ ను కలసిన టీడీపీ నేతలు

మండల పరిధిలోని కనకవీడు, పేట గ్రామాల టిడిపి నాయకులు ఇటీవల నందవరం తహశీల్దార్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కే శ్రీనివాసులను మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తహశీల్దార్ తో మాట్లాడుతూ ఇరు గ్రామాలలో భూ, వెబ్ ల్యాండింగ్ తదితర శాఖాపరమైన సమస్యలు చాలా ఉన్నాయని, గ్రామంలోని ప్రజలు సమస్యల పరిష్కారం కోసం తరుచు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయానికి వస్తూ వుంటారు వారు వచ్చిన సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేక, సర్వర్ ప్రాబ్లమ్స్ వలనో తదితర కారణాల వల్ల తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు మీరు, మీ సిబ్బంది కార్యాలయ సమయాల్లో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని విన్నవించుకున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఇర్మియ, కనకవీడు, పేట గ్రామాల టిడిపి నాయకులు డబ్బా ఈరన్న, పేట సామెల్, ఉరుకుందు, రాముడు, వెంకటేష్, నడ్డి ఈరన్న, చంద్ర, రమేష్, తిమ్మప్ప, బిటి నాయుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News