వైఎస్ఆర్సిపి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదీర్ దార నామినేషన్ ర్యాలీ భారీగా తరలి వచ్చిన జన సందోహాల నడుమ కొనసాగింది. పగిద్యాల రోడ్డు మార్గంలో ఉన్న బ్రహ్మంగారిమఠం దేవాలయం నందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బీ వెంకటస్వామి, యువ నాయకులు ఏక్కలి దేవి చంద్రమౌళిలతో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ ధార ప్రత్యేక పూజల అనంతరం వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తల జన సందోహంతో ప్రచార రథంలో అభివాదం చేసుకుంటూ సాగిన ర్యాలీ స్థానిక పటేల్ సెంటర్ కు చేరుకుంది. అనంతరం పటేల్ సెంటర్ నందు కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బెరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ ధార బరిలో నిలిచారని, నియోజవర్గ ప్రజలపై, తమపై జగనన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారీ మెజార్టీతో గెలుపుకు కృషి చేయాలని కార్యకర్తలను కోరారు.
నందికొట్కూరు నియోజకవర్గం రాజకీయాలపై ఆయన తనదైన శైలిలో చురకలాంటించారు. కొందరు స్వార్థం కోసం లాభాపేక్షతో సంపాదన కోసం, రాజకీయాలు చేస్తున్నారని అలాంటి వారిని నమ్మవద్దని ప్రజలను ఆయన కోరారు. అవసరాల కోసం పూటకొక పార్టీ మారుతూ, విమర్శలు గుప్పిస్తున్న ప్రస్తుత టిడిపి నాయకులు వైసిపి పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులపై పలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వారి చరిత్ర నియోజకవర్గ ప్రజలకు అందరికి తెలుసునని మరోసారి వారికి భంగపాటు తప్పదన్నారు. గతంలో మన పెన్నడూ లేని విధంగా వైసీపీ పార్టీకి నియోజకవర్గంలో చెక్కుచెదరని ఆదరణ కొనసాగుతుందన్నారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం, నియోజవర్గమును అన్ని విధాల అభివృద్ధి పరచడంలో ఏనాడు వెనకడుగు వేయనని, ప్రాణం ఉన్నంతవరకు ప్రజల సంక్షేమ కోసం పాటుపడతానని ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని ప్రజల సంక్షేమ పాలన కేవలం తమ అధినేత జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది అన్నారు. మరోసారి నందికొట్కూరు నియోజకవర్గం లో ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ ధార గెలుపు ఖాయమని, వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకు అన్ని విధాలుగా కార్యకర్తలు, నాయకులు భారీ మెజార్టీ కి కృషి చేయాలని కోరారు.
నన్ను గెలిపించండి.. మీకు సేవ చేస్తా: ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుదీర్ దార
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వం నియోజవర్గ ప్రజలకు భరోసా అని,ప్రజల మెప్పు పొందిన నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రమే అన్నారు. ఆయనపై ఉన్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని తనను గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల, నియోజవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని తనను ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి తాసిల్దార్ కార్యాలయం నందు ఎన్నికల అధికారి ఆర్డిఓ దాస్ కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, ఎక్కల దేవి చంద్రమౌళి లతో కలిసి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ దార నామినేషన్ పత్రాలను అందజేశారు.
నామినేషన్ ర్యాలీకి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ వార్డుల నుంచి వైసీపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. వివిధ మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి మండల నాయకుల, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మన్సూర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శివరామకృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు, పగిద్యాల మండల అధ్యక్షులు పుల్యాల నాగిరెడ్డి, నందికొట్కూరు మండలం ఎంపీపీ మురళి కృష్ణారెడ్డి, సర్పంచ్ రవి యాదవ్, మరియు నందికొట్కూరు కౌన్సిలర్స్, వివిధ గ్రామాల నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.