Saturday, May 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: కేఈ శ్యామ్ బాబు నామినేషన్

Pathikonda: కేఈ శ్యామ్ బాబు నామినేషన్

పత్తికొండ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు.బుధవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఈ.శ్యాంబాబు నామినేషన్ దాఖలను స్థానిక ఎన్నికల అధికారి రామలక్ష్మి కి అందజేశారు.ముందుగా స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గరకు వేలాదిమంది తెలుగుదేశం పార్టీ మహిళలు పురుషులు పెద్ద ఎత్తున చేరుకొని పట్టణంలో పురవీధుల గుండా భారీ ర్యాలీగా గుత్తి సర్కిల్ దగ్గరకు చేరుకొని బహిరంగ సభ నిర్వహించారు.అనంతరం సమావేశాని ఉద్దేశించి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ.శ్యాంబాబు మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అన్నారు.గతంలో నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిన పత్తికొండ ప్రాంతమని అలాంటి ఈ ప్రాంతంలో గతంలో వైయస్సార్సీపి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయమాటలకు ప్రజలు మోసపోయి ఓట్లు వేసి స్థానిక ఎమ్మెల్యేను గెలిపించారు.అయితే పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏమాత్రం నోచుకోలేదని అన్నారు.జరగబోయే 2024 అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించి పత్తికొండ నుండి భారీ మెజార్టీతో నేను గెలుపొందుతానని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని అన్నారు.కావున పత్తికొండ నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఓట్లు వేయగలరని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.గెలిచిన వెంటనే పత్తికొండ నియోజకవర్గ యువతీ యువకుల కోసం నిరుద్యోగుల కోసం రైతులు పరిశ్రమల కోసం అసెంబ్లీలోకి అడుగుపెట్టగానే చర్చించి సాధిస్తానని అన్నారు.అదేవిధంగా కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా పంచలింగాల నాగరాజుకు,అసెంబ్లీ అభ్యర్థిగా నాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపు పొందేలా ప్రజలు ఆదరిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కేఈ.కృష్ణమూర్తి.కేఈ.హరిబాబు.తుగ్గలి నాగేంద్ర.సాంబశివరెడ్డి.రామానాయుడు. ముత్యాల తిరుపాల్.జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జి.రాజశేఖర్. బిజెపి నాయకులు సిసి.రంగన్న. రామాంజనేయులు.భాస్కర్.గుడిసె నరసింహులు.సుబ్బరాయుడు.హాటల్.శీను,రమేష్.బత్తిన లోకునాథ్.తెలుగుదేశం,బిజెపి,జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News