Saturday, May 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: పోటెత్తిన జనసంద్రం మధ్య గంగుల నాని నామినేషన్

Allagadda: పోటెత్తిన జనసంద్రం మధ్య గంగుల నాని నామినేషన్

అఖిలపై 12 కేసులు

ఆళ్లగడ్డ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డి తమ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పుట్టాలమ్మ క్షేత్ర చైర్మన్ గంగుల మనోహర్ రెడ్డి భూమా కిషోర్ రెడ్డి వైకాపా నాయకులు గంగుల సుదర్శన్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి, ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి, విజయ మిల్క్ డైరెక్టర్ గంగుల విజయ్ సింహారెడ్డి కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి , గంగుల కుటుంబ అభిమానులు , వైకాపా నాయకులు కార్యకర్తలతో ఉదయం 10 గంటలకు భారీ ఊరేగింపుగా తమ స్వగృహం నుండి బయలుదేరి నాలుగు రోడ్ల కూడలి పాత బస్టాండ్ మీదుగా తాసిల్దార్ కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారి మల్లికార్జున రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

- Advertisement -

ఎమ్మెల్యే గంగుల నాని నామినేషన్ సందర్భంగా ఆళ్లగడ్డలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ అనంతరం గంగుల నాని మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన అవకాశం మేరకు ఈరోజు తాము నామినేషన్ వేశామని, ఈ కార్యక్రమానికి ఒక పిలుపు ఇవ్వగానే అశేష సంఖ్యలో ప్రజావాహిని తరలి రావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ప్రజలు మరోమారు తనుకు అవకాశం ఇస్తే ఆళ్లగడ్డను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రా రెడ్డి హామీ ఇచ్చారు.

ఈరోజు ప్రతి ఇంటికి అంత ఎంతో మేలు జరిగిందంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరిగిందన్నారు. ప్రజల నాడీ చూస్తుంటే మరోమారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రశాంతత అవసరమని ఆయన అన్నారు. 2019 నుండి ఈ ఐదేళ్ల కాలంలో ప్రశాంత వాతావరణంలో ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటూ జీవించే విధంగా అవకాశం కల్పించామని తెలిపారు.
భూమా అఖిలప్రియపై 12 క్రిమినల్ కేసులు..
తమ ప్రత్యర్థి మొన్ననే నామినేషన్ వేయడం జరిగిందని ఆమె తమ నామినేషన్ పత్రాలలో 12 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ కేసులన్నీ కూడా స్థానికంగా ఉన్న కేసులు కావని ఎక్కడెక్కడో ఆక్రమణలు, కిడ్నాప్ లు, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయన్నారు. అలాంటి క్రిమినల్స్ కు ప్రజలు అవకాశం కల్పిస్తే ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందా అంటూ గంగుల ప్రశ్నించారు.
ప్రజలు మంచివైపు నిలబడి తమను ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరిగి తమ అధికారంలోకి రాగానే రైతు ఆధారిత ప్రాంతమైన ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని చివరి ఆయకట్టు వరకు నీటిని తీసుకుని వచ్చి 3ఆయకట్లకు తెలుగు గంగ నీటిని ఇచ్చి పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు గంగ ప్రాజెక్టు పెండింగ్ పనుల విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తి ఈ ప్రాంతానికి రూ.25 కోట్ల రూపాయలు విడుదల చేయించామని ఆయన తెలిపారు.
ఆగ్రో హబ్ ను ఏర్పాటు చేస్తాం…
ఆళ్లగడ్డ ప్రాంత రైతుల కోసం ఒక ప్రత్యేక ఆగ్రో హబ్ తీసుకొని వచ్చి అన్ని ఒకే చోట లభ్యమయ్యే విధంగా అభివృద్ధి చేస్తామని ఈ ఎన్నికలలో ప్రజలు రైతులు మనస్పూర్తిగా తనను ఆశీర్వదించాలని వైసీపీ అభ్యర్థి గంగుల బ్రీజేంద్రారెడ్డి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్ బాబూలాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News