Sunday, December 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: మా గురుకులంలో క'న్నీళ్ల' బాధ తీర్చే నాథుడెవరో ?

Nandikotkuru: మా గురుకులంలో క’న్నీళ్ల’ బాధ తీర్చే నాథుడెవరో ?

ఇది 615 మంది అమ్మాయిల నీటి సమస్య

నీళ్ల సదుపాయం లేకుండా మీరు ఎంతసేపుండగలరు? నీటి సౌకర్యం లేక 615 మంది అమ్మాయిలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. నీటి సౌకర్యం లేక వందలాది మంది విద్యార్థినిలు ఇబ్బందులు పడుతున్న వసతి సముదాయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల లక్ష్మాపురం హాస్టల్ పరిస్థితి పై తెలుగు ప్రభ అందిస్తున్న ప్రత్యేక కథనం.

- Advertisement -

నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల రోడ్డు మార్గంలో లక్ష్మాపురం గ్రామ అంచ సమీపంలో ప్రభుత్వం చేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం ఉంది ఇక్కడ ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ( గర్ల్స్) చదువుకోవచ్చు. మొత్తం ఈ గురుకులంలో 615 అమ్మాయిలు చదువుకుంటున్నారు. హాస్టల్ నిర్మాణం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వం చేత నాలుగు సార్లు బోరు వేయించినా సరియైన నీళ్లు పడకపోవడంతో నాటి నుండి నేటి వరకు హాస్టల్ విద్యార్థులకు నీళ్ల కష్టాలు తప్పడం లేదు.
నీళ్ల కోసం శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదని, ఇలా బోర్లపై ఆధారపడితే లాభం లేదని పైప్లైన్ ద్వారా నీటిని సమకూరుస్తే తప్ప హాస్టల్లో అమ్మాయిలకు నీటీ కష్టాలు తప్పవని గురుకులం సిబ్బంది వాపోతున్నారు. అమ్మాయిలు పడుతున్న నీటి కష్టాల తీరాలంటే నంద్యాల పార్లమెంట్ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే చొరవతోనే సాధ్యం. లేదంటే నియోజవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు ప్రత్యేక చొరవ కనపరిచితే మా హాస్టల్ పిల్లల కష్టాలు తీరవచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్కూల్ స్టాఫ్. సమీపంలోని రైతు చేనులో ఉన్న బోరును హాస్టల్ పిల్లల అవసరాల కోసం అప్పుడప్పుడు వాడుతున్ననా.. వారు నీళ్లు విడిచినప్పుడే పిల్లలకు ఆ నీళ్లు వాడుకునే అవకాశం ఉంటుందని ప్రిన్సిపాల్ వి వి రమణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

  • శాశ్వత పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చేయూత అందించాలి : ప్రిన్సిపాల్, వివి రమణమ్మ
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల సముదాయంలో వందలాది మంది అమ్మాయిలు విద్యను అభ్యసిస్తున్నారని సరైన నీటి వసతి లేకపోవడంతో అమ్మాయిలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని ప్రిన్సిపల్ వి వి రమణమ్మ అన్నారు. నియోజవర్గం ఎమ్మెల్యే అర్థర్, వైసిపి రాష్ట్రయువత విభాగ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లు ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే మా పిల్లలు ఎన్నుకుంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుందని ఆమె ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆమె వివరించారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News