Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala Collector: వర్షాధార పంటలు మాత్రమే వేసుకోండి

Nandyala Collector: వర్షాధార పంటలు మాత్రమే వేసుకోండి

ఖరీఫ్ పంటలకు నీటి సరఫరా సాధ్యాసాధ్యాలు వెల్లడిస్తాం

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కెసి కెనాల్, తెలుగు గంగ, ఎస్సార్ బీసీ ఆయకట్టుదారులు ఈ ఖరీఫ్ సీజన్ లో వర్షాధార పంటలు మాత్రమే వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సమూన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం 2023 ఖరీఫ్ సీజన్ మొదలైనప్పటి నుంచి కృష్ణా, తుంగభద్ర నదులలో నీటి ప్రవాహం లేనందున, అలాగే శ్రీశైల జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకొని కెనాల్, తెలుగు గంగ, ఎస్సార్ బీసీ ఆయుకట్టుదారులు వర్షాధార పంటలు మాత్రమే వేసుకోవాలని ఆయన సూచించారు. తొందరపడి వరి పంటలు వేసుకో రాదని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. నదులలో ఇన్ ఫ్లో ఆధారంగా తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల నుంచి నీరు చేరిన పిదప ఖరీఫ్ పంటలకు నీటి సరఫరాపై సాధ్యసాద్యాలను ఐఎబి సమావేశంలో తీర్మానించి రైతన్నలకు తెలియజేస్తామని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News