Wednesday, July 3, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala Collector: 'జగనన్నకు చెబుదాం - స్పందన'పై సత్వర చర్యలు

Nandyala Collector: ‘జగనన్నకు చెబుదాం – స్పందన’పై సత్వర చర్యలు

నిర్ణీత కాల పరిమితిలోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలి

ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ‘జగనన్నకు చెబుదాం – స్పందన’ కార్యక్రమంలో స్వీకరించిన విజ్ఞప్తులపై సత్వర చర్యలు గైకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఇతర జిల్లాధికారులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత కాల పరిమితిలోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -

పెండింగులో వున్న 132 రీఓపెన్ సర్వీసులకు సంబంధించి దరఖాస్తులన్నింటినీ వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళ్లకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. మొక్కుబడి రీతిలో క్లోజ్ చేయకుండా అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో ఖచ్ఛితమైన పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్ లో ఉన్న జగనన్నకు చెపుదాం ఈకేవైసీని రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరైన 1372 పనుల్లో 705 పనులు పురోగతిలో వున్నాయని మిగిలిన పనులు వెంటనే గ్రౌండ్ లోకి తీసుకరావాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే త్వరితగతిన పూర్తి చేసి బడి బయట ఉన్న విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు
బనగానపల్లె మండల నివాసి మాజీ సైనికుడు ఎస్ ఎం బాషా తనకు మాజీ సైనికుల కోటా కింద 2012 సంవత్సరంలో సర్వే నెం. 174, 175 లలో 9.8 సెంట్లు ఇచ్చారని… సదరు భూమిలో సాగు చేసుకుంటున్నానని జి.ఓ 297 ప్రకారం అసైన్మెంట్ నిషేధిత జాబితా నుండి తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామ నివాసి బికారి సాహెబ్ తనకున్న 1.95 సెంట్ల స్థలాన్ని ఆన్లైన్లో ఎక్కించాలని కోరుతూ కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.మహానంది మండలం గాజులపల్లి గ్రామ నివాసితురాలు జయమ్మ తనకు సర్వే నంబర్ 34 లో 16 సెంట్ల భూమి వుందని…. సదరు స్థలంలో కరెంట్ తీగలు వెళ్లి వున్నాయి… తొలగించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు అధిక మొత్తంలో ఛార్జ్ చేస్తున్నారని, అధిక మొత్తం తాను చెల్లించుకోలేనని కరెంటు తీగల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరుతూ దరఖాస్తు సమర్పించుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 215 మంది అర్జీదారులు తమ సమస్యలపై వినతి పత్రాలుజిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కు సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ వారు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News