Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Peapully: చంద్రబాబు క్షేమం కోసం మాన్యసూక్త యాగం

Peapully: చంద్రబాబు క్షేమం కోసం మాన్యసూక్త యాగం

చంద్రబాబు నాయుడు లాంటి నిజాయితీపరుడైన నాయకులను జైలుకు పంపడం సిగ్గు చేటని తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై నాగేశ్వరావు యాదవ్ వ్యాఖ్యనించారు. ప్యాపిలిలోని స్థానిక చెన్నకేశవ స్వామి గుడిలో చంద్రబాబు క్షేమాన్ని ఆకాంక్షిస్తూ మాన్యసూక్త యాగం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ “బాబు కోసం మేము సైతం ఈ పోరాటం నా ఒక్కడి కోసం కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం యువత కోసం అక్క చెల్లెళ్ల మరియు అన్నదమ్ముల కోసం భావితరాల కోసం నేను చేస్తున్న ఈ యాగం అని అన్నారు. వై నాగేశ్వరరావు యాదవ్ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ప్యాపిలి మండలం నాయకుల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు క్షేమాన్ని కోరుతూ మాన్యసూక్త యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాగం వై నాగేశ్వరరావు యాదవ్, సతీమణి శైలజ యాదవ్, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రఘుగిరిధర్ యాదవ్, సతీమణి శ్రావణి యాదవ్ లు నిర్వహించారు. ఈ యాగంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పద్మజ, గౌతమ్ రెడ్డి, ప్రసన్నలక్ష్మి, లక్ష్మీనారాయణ యాదవ్, పోతురాజు రవి, రామ్మోహన్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, గండికోట పెద్ద రామాంజనేయులు, నడిగడ్డ నాగేంద్ర, భూశెట్టి సుంకయ్య, కొంగనపల్లి మధు, ప్రసాద్ రెడ్డి, అంకిరెడ్డి, గండికోట రామసుబ్బయ్య, మామిళ్ళపల్లి మోహన్, కొమ్మే మర్రి వెంకటరాముడు, చల్లా వీరాంజనేయులు, ఆర్ మల్లికార్జున, శ్రీనివాసులు, చల్లా అనుదీపు, అక్బర్, కుళ్లాయప్ప, మహేష్, మల్లికార్జున, రాంపురం రమేష్, సత్యం, రాజశేఖర్, భాస్కర్, చంద్రపల్లి సందీప్, రామ్మోహన్,రామయ్య, హుసేనాపురం, శ్రీనివాసులు, బేతంచెర్ల అంబాపురం, శ్రీనివాసులు, బూరు గల ఓబుల్ రాజు, మాధవ రాజు, ప్రనీతు, శేఖర్ రెడ్డి, రాచర్ల శ్రీరాములు, జయరాముడు, ఆదిరెడ్డి, మహేష్, పోతు దొడ్డి పుల్లారెడ్డి, కదిరప్ప, నారాయణ, వెంగళంపల్లి రమేషు, వెంకటప్ప, వేణుగోపాలు, బాలు, రామాంజనేయులు, రాంభూపాల్, కార్తీక్, మెట్టుపల్లి సుదర్శన్, సుంకన్న, సాంబ, రంగాపురం, ఆర్సి మద్దిలేటి, రామచంద్రుడు, వెంకటాంపల్లి, నాగరత్నమయ్య, వెంకటరంగయ్య, వేణుగోపాలు, బాబు, జంగా రమణయ్య, బాల రంగన్న, యాకూబ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున యాగంలో పాల్గొన్నారు.

- Advertisement -

ఆనాడు శ్రీకృష్ణుడి కోసం చేసిన యాగం ఈనాడు చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగుండాలనీ, త్వరగా బయటకు రావాలని చంద్రన్న కోసం చేసిన యాగమే మాన్యసూక్త యాగం అని తెలిపారు. ఈ యాగంలో భాగమై సకల దేవతల ఆశీస్సులతో మచ్చలేని చంద్రుడిలా ప్రజల మధ్యకు రావాలని కోరుకుంటూ యాగం నిర్వహించామని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి తప్పలేదు నీలాపనిందలు, శ్రీకృష్ణుడుపై శమంతకమణి దొంగలించాడనే అభియోగాన్ని విఘ్నేశ్వరుడి పూజమహిమ ద్వారా ఆయన ఎలా బయటపడ్డాడో అందరికీ తెలిసినదేనని, కలియుగంలో నేడు చంద్రబాబు నాయుడుపై పడిన నీలాపనింద కూడా అలాంటిదేనని అన్నారు. ఆ అపవాద నుండి నిర్దోషిగా,దుష్ట పరిపాలకుల కుట్రల నుండి బయటకు రావాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News