మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) భార్య జయసుధకు మచిలీపట్నం కోర్టులో ఊరట దక్కింది. రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ(Perni Jayasudha) మచిలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గత వారం విచారణ చేపట్టిన కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. తాజాగా ఈ కేసులో ఏ1గా ఉన్న జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో జయసుధకు జిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. తొలుత 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం అయ్యాయంటూ రూ.1.68 కోట్ల జరిమానా విధించగా.. ఆ సొమ్మును పేర్ని నాని కట్టారు. అయితే ఆ తర్వాత మరిన్ని బస్తాల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. దీంతో అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తంగా గోదాం నుంచి మొత్తంగా గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు.