భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏపీ పర్యటన ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 8న ఆయన రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(CM Ramesh)తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా పుడిమడకలో ఎన్టీపీసీ(NTPC), ఏపీ జెన్ కో జాయింట్‌గా నెలకొల్పనున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్(Green Hydrogen Hub).. అలాగే నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్(Mittal Steel Plant) నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.
కాగా మొత్తం రూ.84,700 వేల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు పెట్టనున్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. ఈ రెండు ప్రాజెక్టులను ఏపీ జెన్‌కో, ఎన్టీపీసీ 50: 50 భాగస్వామ్యంతో నిర్మించనున్నాయి. ప్రాజెక్టుల వల్ల వచ్చే నాలుగు సంవత్సరాల్లో 48వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.